ప్లీజ్ అలాంటి వార్తల్ని ప్రచారం చేయొద్దు!

నటి మీనా ట్విట్టర్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్‌

హైదరాబాద్: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ తాజాగా శ్వాసకోశ సంబంధిత వ్యాధి కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర దుఖంలో మునిగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శుక్రవారం తన భర్తకు నివాళులర్పిస్తూ మీనా ట్విట్టర్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్‌ చేశారు. విద్యాసాగర్‌ మరణం గురించి తప్పుడు కథనాల్ని ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు. 

‘భర్తను కోల్పోవడం నన్ను తీవ్ర విషాదం ముంచెత్తింది. ఈ పరిస్థితిలో కాస్త మా మానోభవాలను గౌరవిస్తూ హూందాగా వ్యవహరించాలని మీడియాను కోరుతున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నా భర్తను ప్రాణాలను కాపాడడం కోసం ప్రయత్నించిన వైద్యులకు,  ప్రభుత్వ అధికారులకు, అందరికి నా కృతజ్ఞతలు’ అని మీనా ట్విట్టర్‌లో పేర్కొంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox