ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కూతురు.. ఇనాళ్ళకు కుదిరింది.

‘అగ్ని నక్షత్రం’ సినిమాలో హీరో మోహన్‌బాబు, మంచు లక్ష్మీ

హైదరాబాద్: సీనియర్‌ హీరో మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రీకరణ తుది దశలో ఉందీ. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ పాత్రలు కొత్త తరహాలో ఉంటాయని చిత్ర బృందం తెలిపారు. సముద్ర ఖని, చైత్ర శుక్ల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జబర్దస్త్‌ మహేష్‌, విశ్వంత్‌, మలయాళ నటుడు సిద్ధిఖ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తొలిసారి ఈ చిత్రంలో తండ్రీ కూతురు కలిసి నటిస్తున్నారు. సముద్ర శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. డైమండ్‌ రత్నబాబు అందించిన కథతో ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox