Chromecast: ఇండియాలో క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ TV డివైజ్ లాంచ్.. ధర రూ.6,399.. స్పెసిఫికేషన్లు ఇవే..

Chromecast: ఇండియాలో క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ TV డివైజ్ లాంచ్.. ధర రూ.6,399.. స్పెసిఫికేషన్లు ఇవే..

టెక్ దిగ్గజం గూగుల్ నుంచి ఇండియాలో మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. భారత్‌లో గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ డివైజ్ సోమవారం లాంచ్ అయింది. దీని ధరను రూ.6,399గా నిర్ణయించింది. 4K సపోర్ట్‌తో రిలీజ్ అయిన ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. అయితే రిటైల్ స్టోర్స్‌లోకి ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను గూగుల్ త్వరలో వెల్లడించనుంది. ఫ్లిప్‌కార్ట్ ఇంతకు ముందే ఈ కొత్త ప్రొడక్ట్‌ను ధరతో పాటు వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఉంచింది. అధికారికంగా లాంచ్ అవ్వడానికి ముందే దీని ధరను ఫ్లిప్‌కార్ట్‌ ధ్రువీకరించింది. గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ 4K (Google Chromecast With TV 4K) మంచు (Snow) లాంటి వైట్ కలర్‌లో రిలీజ్ అయింది.

అయితే గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ అధికారికంగా కొన్నేళ్ల క్రితమే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ 2020లో పిక్సెల్ 4a 5G, పిక్సెల్ 5తో పాటు ఈ డివైజ్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ డివైజ్‌ ఇప్పటి వరకు భారత్‌లో లాంచ్ కాలేదు. కాగా గత నెలలో గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీని భారత్‌తో సహా మరో 12 దేశాలలో లాంచ్ చేస్తామని కంపెనీ ఒక నివేదికలో పేర్కొంది. గూగుల్ ఈ డివైజ్‌ను లాంచ్ చేసే ముందు అందులోని ఫీచర్లను ఇండియన్ యూజర్ల అవసరాలకు తగినట్లుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కారణంగానే ఈ డివైజ్ లాంచింగ్ ఆలస్యమైంది.

* క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ ఫీచర్లు

ఈ క్రోమ్‌కాస్ట్ ప్రతి సెకన్‌కు 60 ఫ్రేమ్‌ల చొప్పున 4K HDR క్వాలిటీ వీడియోలను అందిస్తుంది. అంటే 60Hz రిఫ్రెష్ రేట్‌ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి డాల్బీ విజన్‌ సపోర్ట్‌తో కూడా ఇది వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ కోసం డెడికేటెడ్ బటన్‌లతో క్రోమ్‌కాస్ట్ రిమోట్‌ను యూజర్లు పొందవచ్చు. ఇందులో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. కంపెనీ కొత్త క్రోమ్‌కాస్ట్‌లో సింపుల్ యూఐ గల గూగుల్ టీవీకి యాక్సెస్‌ను అందించింది. ఈ డివైజ్‌లో రకరకాల యాప్స్‌, ఫీచర్‌లను గూగుల్ అందించింది.

courtesy:https://telugu.news18.com/news/technology/chromecast-with-google-tv-device-launch-price-in-india-rs-6399-specifications-umg-gh-1366932.html

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం