చెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడు మృతి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో ఘటన

వరంగల్: చెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం, ఊకల్  గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం వృత్తి పనిలో భాగంగా కల్లు గీయడానికి వెళ్లిన పాల సుధాకర్ గౌడ్ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. దీంతో సుధాకర్ గౌడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, సుధాకర్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని, తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ..సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా వచ్చే సాయం వెంటనే వచ్చేలా కృషి చేస్తామని కమిటీ సభ్యులు సుధాకర్ గౌడ్ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. 

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం