గొప్ప అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది: జేడీ లక్ష్మీ నారాయణ

వీవీ లక్ష్మీనారాయణ శుక్రవారం ఆసక్తికర ట్వీట్

అమరావతి: ఛత్రపతి శివాజీ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. సింహగఢ్ కోటను చేజిక్కించుకున్న తర్వాత... కోటను గెలిచాం, కానీ సింహాన్ని (తానాజీ మాలుసరే) కోల్పోయాం అని ఛత్రపతి శివాజీ అన్నారని తెలిపారు. ఇప్పుడు ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పూర్తి విధేయత ఎన్డీయేరాష్ట్రపతి అభ్యర్థికి విజయాన్ని తెచ్చిపెట్టింది కానీ, పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ల కోసం ఒత్తిడి తెచ్చే గొప్ప అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయిందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం