ముగిసిన ఎన్టీఆర్ కుమార్తె అంత్యక్రియలు

శోక సంద్రంలో నందమూరి కుటుంబం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ స్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరీ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరీ అంత్యక్రియలు జరిగాయి. అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులు, బంధులు తరలివచ్చి ఉమామహేశ్వరి పార్థివదేహానికి వీడ్కోలు పలికారు. సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఉమామహేశ్వరీ బలవన్మరణానికి పాల్పడగా ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉమామహేశ్వరీ కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు.

ఈ అంత్యక్రియల్లో బాలకృష్ణ, రామకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కంఠమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతిమ సంస్కారాలను ఉమామహేశ్వరి భర్త శ్రీనివాస్‌ పూర్తి చేశారు. కాగా, నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఉమామహేశ్వరిని కడసారి చూసేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox