పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలను జయప్రదం చేద్దాం: మోకుదెబ్బ జాతీయ కమిటీ

ఆగస్టు 18 నుండి 25 వరకు పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలు

హైదరాబాద్: దళిత బహుజన విప్లవ వీరుడు, బడుగు బలహీన వర్గాల మార్గదర్శి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుండి 25 తేది వరకు దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని మోకుదెబ్బ జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అతి ఉత్సహానికి వెళ్లి పాపన్న గౌడ్ జయంతిని ముందుగానే నిర్వహిస్తున్నారని, అది కరెక్ట్ కాదని వారు పేర్కొన్నారు. పుట్టక ముందే పుట్టిన రోజులు చరిత్రలో ఎక్కడ చెయ్యరని వారు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ మాత్రం ఆగస్టు 18 నుండి 25 వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. దేశంలోనే  మొదటి సారిగా మోకుదెబ్బ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో గుఱ్ఱం మీద ఉన్న సర్డార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం