బీసీ దివ్యాంగులకు ఉచిత వైద్యం అందించేందుకు కృషి: అమ్మిరెడ్డి రజిని

ఈడేపల్లి బీసీ సంక్షేమ సంఘ సమావేశంలో పాల్గొన్న అమ్మిరెడ్డి రజిని

కృష్ణ: ఆర్థికంగా వెనుకబడిన బీసీ దివ్యాంగులకు ఉచిత వైద్యం అందించేందుకు బీసీ సంఘం కృషి చేస్తున్నట్లు నగర మహిళ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజిని పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఈడేపల్లి బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర మహిళ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజిని పాల్గొని మాట్లాడారు. విశాఖపట్నం రాణి చంద్రమణి దేవి ఆస్పత్రిలో ఆర్థికంగా వెనుకబడిన బీసీ దివ్యాంగులకు బీసీ సంక్షేమ సంఘం లెటర్ హెడ్ సిఫార్సుతో ఉచిత శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ, పూర్తి చేయించి, వారికి అవసరమైన పరికరాలను అందజేయనున్నట్లుగా ఆమె తెలిపారు.

ట్రైన్ పాస్ లేని దివ్యాంగులకు పాస్ ఏర్పాటు చేయించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కుల ధ్రువీకరణ పత్రం, సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ వంటి పత్రాలతో ముందుగా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  వేముల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు తోట బాబు, జన్ను గోవింద్రాజులు, మురాల వెంకటేశ్వర రావు, పోలగాని  వెంకటేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం