తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.!..ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

తెరాస(TRS) ను వీడే దిశ‌గానే తుమ్మ‌ల ఈ వ్యాఖ్య‌లు చేశారా? అన్న దిశ‌గా ఆలోచనలు మొదలు పెట్టిన రాజకీయ వర్గాలు

హైదరాబాద్: ఏ క్ష‌ణ‌మైనా ఎన్నికల పిడుగు ప‌డొచ్చ‌ని.. కార్య‌క‌ర్త‌లంతా సిద్ధంగా ఉండాల‌ని తెరాస నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ‌లో అధికార పార్టీ తెరాస(TRS) లో కీల‌క నేత‌గా కొన‌సాగుతున్న మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బుధ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తుమ్మ‌ల ప్ర‌క‌ట‌న ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో... ప్ర‌త్యేకించి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో టీడీపీతో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన తుమ్మ‌ల.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో తెదేపా అంత‌కంత‌కూ క్షీణిస్తున్న త‌రుణంలో పార్టీని వీడి తెరాస(TRS) కండువ కప్పుకున్నారు. దీంతో ఆయ‌న‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఎమ్మెల్సీగా అవ‌కాశాన్ని ఇచ్చారు. అయితే 2018 ఎన్నిక‌ల త‌ర్వాత తెరాస(TRS) లో తుమ్మ‌ల‌కు క్ర‌మంగా ప్రాధాన్యం తగ్గిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి.

ఈ క్ర‌మంలో తెరాస(TRS) ను వీడే దిశ‌గానే తుమ్మ‌ల ఈ వ్యాఖ్య‌లు చేశారా? అన్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్పటికే 2018లో మాదిరిగానే ఈ దఫా కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని విపక్షాలు చెబుతుండగా... తెరాస(TRS)  మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చంటూ తుమ్మల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం