కమిట్మెంట్ సినిమాని ఆడనీయం: విశ్వహిందు పరిషత్

హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా కమిట్మెంట్ ట్రైలర్

నిజామాబాద్: హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న కమిట్మెంట్ సినిమాను థియేటర్లలో ఆడనీయమని విశ్వహిందు పరిషత్ నాయకులు తెలిపారు. ఈ సినిమా తీసిన నిర్మాత, దర్శకుడు, నటులపై కేసు నమోదు చేయాల్సిందిగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నవీపేట తహసిల్దార్, ఎస్ఐలకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ మాట్లాడుతూ.. కమిట్ మెంట్ సినిమా టీజర్ లో భగవద్గీత శ్లోకాన్ని కించపరిచే విధంగా ఉందని అన్నారు. కమిట్మెంట్ సినిమాను రిలీజ్ కాకుండా ప్రభుత్వం ఆపాలని అన్నారు.

సినిమా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాని కొనుగోలు చేయవద్దని, థియేటర్లలో ఆ సినిమా ఆడితే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు నిర్వహిస్తామని, పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గణేష్, శాఖావార్ రమేష్, రాజు, సంతోష్, గోపు అఖిలేష్, చిట్టిబాబు, నవీన్, భరత్ తదితరులు ఉన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం