పదిహేను మంది తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దం: బండి సంజయ్(Bandi Sanjay)

రాష్ట్రంలో మరిన్ని ఉపఎన్నికలు(By elections) వస్తాయన్న బండి సంజయ్(Bandi Sanjay)

యాదాద్రి: తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు(By elections) రానున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభించారు. ఇవాళ మూడో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. కాగా, గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పార్టీ, మోడీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో మాట్లాడారని తెలిపారు. అలాగే 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలతో ఒత్తిడి తెప్పించుకుని రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చికోటి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు. అయితే ఈ స్కామ్‌ను కూడా డ్రగ్స్ స్కామ్ లాగే నీరు గార్చేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. మునుగోడులో భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం