ప్రతిష్టాత్మక పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

రూ.600కోట్ల వ్యయంతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) గురువారం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను(Telangana State Police Intigrated Command Controll Center) ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు వచ్చిన కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్ద పూజలు చేసి ప్రారంభించారు.

అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. కాగా, ఈ సెంటర్ ను ఏడెకరాల స్థలంలో రూ.600కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox