ఏపీ మద్యం(Wine) వ్యాపారంలో ప్రజాధనం దోపిడీకి గురవుతోంది: బొండా ఉమ(Bonda Uma)

రూ. 15 మద్యం(Wine) బాటిల్‌ను రూ. 200 అమ్ముతారా? అంటూ ప్రశ్న

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యం(Wine) వ్యాపారంలో ప్రజాధనం దోపిడీకి గురవుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమ(Bonda Uma) ఆరోపించారు. రూ.15 లకే దొరికే మద్యం(Wine)ను రూ. 200కు విక్రయిస్తున్నారని బోండా ఉమ విమర్శలు గుప్పించారు. మద్యం(Wine) దుకాణాల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు కాకుండా నగదు మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం వద్దకు నగదు రూపేణా మొత్తం జమ అవుతోందని వివరించారు. అదాని డిస్టిలరీ రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నదని ఈ డిస్టిలరీ ఎవరిదో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అదాని కంపెనీ వైసీపీ నాయకులదని, బినామీపేర్లతో కంపెనీని నడిపిస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ హయాంలో మద్యం(Wine) విక్రయాలను పారదర్శకంగా, బహిరంగంగా విక్రయించామని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం బేవరేజెస్‌ నుంచి ఎంతకు కొంటున్నారో బయటకు రాదని తెలిపారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం