కాంగ్రెస్ లో రోజురోజుకు ముదురుతున్న అంతర్గత కలహాలు

ఇకపై రేవంత్‌ రెడ్డి(Revanth reddy) ముఖం చూడనన్న ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధిష్టానం తాజా నిర్ణయాలతో  పార్టీలో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth reddy)పై తీవ్ర స్థాయిలో మండిపడగా పెద్దలు కలగించుకోవటం ఆ గోడవ కాస్త సద్దుమనిగింది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తానని ప్రకటించన తర్వాత ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth reddy) పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

ఇక తాజాగా రేవంత్‌ రెడ్డి(Revanth reddy) మొఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. చెరుకును చేర్చుకునే విషయంలో రేవంత్‌ రెడ్డి(Revanth reddy) పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆయన ముఖం చేసేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ నేడు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. 

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం