కామన్వెల్త్‌(Commonwealth) క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

పారా పవర్‌లిఫ్టింగ్‌లో సుధీర్‌కు గోల్డ్‌

బర్మింగ్‌హాం: కామన్వెల్త్‌(Commonwealth) క్రీడల్లో భారత క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు. పతకాల పట్టికలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్‌ స్వర్ణ పతకం సాధించాడు. సుధీర్ కామన్వెల్త్‌(Commonwealth) గేమ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తొలిప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్‌, రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు.

దీంతో మొత్తంగా 134.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక క్రిస్టియన్‌ ఒబిచుకు 133.6 పాయింట్లతో సిల్వర్‌, 130.9 పాయింట్లతో మిక్కి యులె కాంస్యం సాధించాడు. జూన్‌లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో 214 కిలోల బరువెత్తి కాంస్యం సొంతం చేసుకున్నారు. హాంగ్జూలో జరగాల్సిన ఏషియన్‌ పారా గేమ్స్‌కు కూడా అర్హత సాధించాడు. కాగా, ఆసియా పారా ఒలింపిక్స్‌ కాంస్య విజేత సుధీర్ తెలిసిన విషయమే. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం