మంకీపాక్స్‌(Monkeypox) వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ

అమెరికాలో సుమారు 6600 మందికి మంకీ పాక్స్ నిర్ధారణ

వాషింగ్ట‌న్‌: అమెరికాలో మంకీపాక్స్‌(Monkeypox) కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు  ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంకీపాక్స్‌(Monkeypox) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా, అమెరికాలో సుమారు 6600 మందికి మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయింది. దీంట్లో మూడ‌వ వంతు కేసులు న్యూయార్క్‌లో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ రాష్ట్రం స్వంతంగా ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ ఏడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా 26వేల కేసులు న‌మోదు అయిన‌ట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ వెల్లడించింది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం