ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నికల్లో ఎన్డీయేతర అభ్యర్థికే తమ మద్దతు: టీఆర్ఎస్

టీఆర్ఎస్(TRS) మ‌ద్ద‌తు మార్గ‌రేట్ అల్వాకే

న్యూదిల్లీ: ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నికల్లో ఎన్డీయేతర అభ్యర్థికే తమ మద్దతు పలుకుతున్నట్లు తెరాస శుక్రవారం ప్రకటించింది. విప‌క్షాల ఉపరాష్ట్రపతి(Vice President) అభ్య‌ర్థిగా మార్గ‌రేట్ అల్వా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అల్వాకు తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌క‌టించింది. మార్గ‌రేట్ అల్వాకు మద్దతునివ్వాలని తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది తెరాస ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. తెరాస పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటనను విడుదల చేశారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం