తిరుమల శ్రీవారికి రూ. 4.99 కోట్ల కానుకలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వామివారి చెంత భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 62,351 మంది దర్శించుకుని తమ కోర్కెలను స్వామికి విన్నవించుకున్నారు. దర్శించుకున్న వారిలో 31,473 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోడానికి భారీగా తరలివస్తున్న నేపథ్యంలో స్వామి వారికి భారీగా కానుకలు అందజేస్తున్నారు.  కాగా, హుండీ ఆదాయం రూ. 4.99 కోట్లు వచ్చిందని తెలిపారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం