హిందూ సంప్రదాయం ప్ర‌కారం ఒక్కటైన ర‌ష్యా, ఉక్రెయిన్ జంట‌

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో వివాహం చేసుకున్న జంట

ధ‌ర్మ‌శాల‌: హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఇద్దురు విదేశీయలు ఒక్కటయ్యారు. ఉక్రెయిన్‌, ర‌ష్యాకు చెందిన ఓ జంట‌ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశాల వైరుధ్యాన్ని పక్కన పెట్టి హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ధ‌ర్మ‌శాల‌లో ఉంటున్న ఆ జంట గ‌త ఏడాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు.

ర‌ష్యాకు చెందిన సెర్గీ నొవికోవ్‌.. ఉక్రెయిన్ అమ్మాయి ఎలోనా బ్ర‌మోకాలు స‌నాత‌న హిందూ ధ‌ర్మ ఆచారం ప్ర‌కారం పెళ్లి చేసుకున్నారు. ధ‌ర్మ‌శాల‌లోని దివ్య ఆశ్ర‌మంలో ఈ వేడుక జ‌రిగింది. అయితే ఈ పెళ్లి సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం ఉన్న నేప‌థ్యంలో ఈ పెళ్లి ప్ర‌త్యేక‌త సంతరించుకుంది. స్థానికులు ఈ పెళ్లికి హాజ‌రై చిందులు వేశారు. అతిథుల‌కు కంగ్రి థామ్ సంప్ర‌దాయ భోజ‌నాన్ని కూడా ఆ జంట ఏర్పాటు చేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం