శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే కోరిన వరాలు నెరవేరుతాయి.. వరలక్ష్మీ వ్రత విశిష్టత ‌

వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham) సందర్భంగా ప్రత్యేక కథనం

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham)గా జరుపుకుంటారు. శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని, శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. అయితే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham)గా పిలుస్తారు. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కోరిన వరాలిచ్చే వ్రతమే మహాలక్ష్మీ వరలక్ష్మీ దేవి వ్రతం.

అష్ట లక్ష్మీదేవతలలో వరలక్ష్మీ దేవికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ వ్రత విశిష్టత గురించి సాక్షాత్తూ పరమశివుడే గౌరీ దేవికి చెప్పిన్నట్లు స్కంద పురాణంలో పొందుపరచబడింది. సకల సంతోషాలను, ఐశ్వర్యాలను, పుత్రపౌత్రోధులను పెంచుకునేందుకు వీలుగా స్త్రీలు చేపట్టే ఏదైనా పూజను కానీ,  వ్రతాన్ని కానీ సూచించాలని పార్వతీ దేవి పరమేశ్వరుడిని కోరగా.. అందుకు పరమేశ్వరుడు ఈ వ్రతం గురించి తెలిపాడని పురాణాల్లో చెప్పబడింది.

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలిపాడట. భర్త పట్ల ఆరాధాన, అత్తామామల పట్ల గౌరవ భావాన్ని పాటిస్తూ చారుమతి ఉత్తమ ఇళ్లాలైందని, మహాలక్ష్మీ దేవీ పట్ల అమితమైన భక్తి శ్రద్ధలకు అమ్మవారి అనుగ్రహం కలిగి కళలో దర్శనం ఇచ్చిందని శివుడు పార్వతీ దేవికి తెలిపారు. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చే  శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని అమ్మ చెప్పగా అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతికి సమస్త సిరి సంపదలను కలిగాయని ఈశ్వరుడు గౌరికి తెలిపినట్లు పురాణాల్లో చెప్పబడింది.

దీంతో పార్వతీ దేవి ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీ అనుగ్రహం పొందిందని చెబుతారు. అమ్మవార్ల పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని పండితులు వ్యాఖ్యానిస్తారు. శ్రీహరికి ఇష్టమైన విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో(Sravana Masam) ఈ వ్రతం ఆచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం. అందుకే మహిళలు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం