కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

వరద సాయంపై అమిత్‌షాను కలిశానన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

న్యూదిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers) రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy), వెంకటరెడ్డి(Venkat Reddy) వేర్వేరుగా కలిశారు. వ్యక్తిగతంగా అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి కలవగా, వరద సాయంపై అమిత్‌షా (Amit Shah)ను వెంకటరెడ్డి కలిశారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయం, భాజపా నాయకులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజాపా కండువ కప్పుకోనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, అమిత్ షాతో సమావేశం అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వరద నష్టాలపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. వరద బాధితుల కష్టాలను అమిత్‌షాకు తెలియజేశానని అన్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల రూ.1400 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. ఈ భేటీకి తాను వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం జరిగేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) స్పష్టం చేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox