కుమార్తెను తల్లిని చేసిన తండ్రి.. చెన్నై లో దారుణ ఘటన

మగబిడ్డకు జన్మనిచ్చిన కుమార్తె

చెన్నై: కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవల కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు బాలికను ప్రభుత్వ వెల్లూరు మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

దీంతో  బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక ఆగస్ట్‌ 2న మగ బిడ్డను ప్రసవించింది. దీంతో వైద్యాధికారులు ఈ విషయాన్ని పిల్లల సంక్షేమ కమిటీకి తెలుపగా, వారు వెల్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, మహిళా పోలీసులు ఆ బాలికను ప్రశ్నించారు. దీంతో తన తండ్రి గత పది నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు. బాలిక స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆమె తండ్రిని వెల్లూరు మహిళా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్‌ విధించింది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox