ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబర్చుకున్న యువకుడు

వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఘటన

వరంగల్: ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబర్చుకున్న యువకుడి ఘటన వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. బాలాజీ నగర్ కు చెందిన ఓ మైనర్ బాలికపై, అదే ప్రాంతానికి చెందిన కక్కర్ల ఆకాష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి అబార్షన్ చేయించాడు. అయితే ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తేలవడంతో, అమ్మాయిని పిలిపించి మీ తల్లిదండ్రులకు చెప్పినట్లయితే చంపుతామని బెదిరించి, ఆకాష్ తల్లి రాధిక, సోదరి హర్షితల సహాయంతో స్టేషన్ ఘన్పూర్ లోని ఓ ఆర్ఎంపీ వద్ద రెండు నెలల క్రితం అబార్షన్ చేయించారు.

ఈ క్రమంలో అమ్మాయి బలహీనంగా కనబడడంతో తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఈ మేరకు తల్లిదండ్రులు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తి పై అత్యాచార, ఎస్సీ, ఎస్టీ ఫోక్సో కేసు నమోదు చేయాలని కోరారు. యువకుడి తల్లి, సోదరి పై, ఆర్ఎంపి డాక్టర్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని వరంగల్ ఏసీపీ గిరి కుమార్ కలకోట తెలిపారు. 

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం