చెరువులో మేతకు వెళ్లి పదివేల బాతులు మృత్యువాత

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తిరుపతి జిల్లా: చెరువులో మేతకు వెళ్లి పదివేల బాతులు మృతి చెందిన ఘటన పెళ్లకూరు మండలం రావుల పాడు గ్రామంలో చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలానికి చెందిన ముని రాజా, అంజలి దంపతులు గత కొద్ది రోజులుగా రావుల పాడు గ్రామంలో ఉంటూ బాతులను మేపుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే  శుక్రవారం ఉదయం చెరువులోకి బాతులను మేత కోసం వదిలారు. కొంత సమయం తర్వాత బాతులు మృతిచెంది ఉండడం గమనించిన ఆ దంపతులు గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చెరువులో ఉన్న నీటిలో విషప్రయోగం జరిగి ఉన్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాతులను  పశువర్ధక శాఖ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతి చెందిన బాతులు సుమారు 15 లక్షల విలువ చేస్తాయని బాధితులు తెలిపారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం