రేపు ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్ష.. హాజరుకానున్న 2.47 లక్షల మంది

పోలీస్ నియామక మండలి అభ్యర్థులకు పలు సూచనలు

హైదరాబాద్: ఈ నెల 7న(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం నిర్వహించనున్న పరీక్షకు హైదరాబాద్‌ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో 503, ఇతర పట్టణాల్లో 35 కలిపి మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, నిన్న రాత్రితో హాల్ టికెట్ డౌన్ లోడ్ పూర్తియ్యింది. ఈ మేరకు పోలీస్ నియామక మండలి అభ్యర్థులకు పలు సూచనలు చేసింది.  

  • అభ్యర్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్‌లో రెండు వైపులా(హాల్‌టికెట్‌ ఒకవైపు, వెనుక వైపు సూచనలు ) వచ్చేలా ప్రింట్‌ అవుట్‌ను తీసుకోవాలి. కలర్‌లో ప్రింట్‌ అవుట్‌ అవసరం లేదు.
  • ప్రింట్‌అవుట్‌ తీసుకున్న తర్వాత దానిలో ఎడమవైపు కింది భాగంలో ఇచ్చిన బాక్స్‌లో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను అతికించాలి. పోటోను అతికించేందుకు పిన్నులతో, గుండు పిన్నులను వాడరాదు. 
  • ఫొటో అతికించని హాల్‌టికెట్‌తో వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించరు.
  •  పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసినలాంటిదే ఉండాలి.
  • పరీక్ష కేంద్రంలోకి బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నులు అనుమతిస్తారు.
  • పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్‌ విధానంలో హాజరు తీసుకుంటారు. కాబట్టి, అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు పెట్టుకోకూడదు.
  • అభ్యర్థులు మొబైల్స్‌, ట్యాబ్లెట్లు, పెన్‌ డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, రిస్ట్‌వాచ్‌, వ్యాలెట్‌, విడి కాగితాలు వెంట తీసుకురాకపోవడమే ఉత్తమం. వీటిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox