ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల

రూ.25 ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం

హైదరాబాద్: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ (టాస్‌)లో చదివే అభ్యర్థులకు సంబంధించిన పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఓపెన్‌ స్కూల్‌లో టెన్త్‌, ఇంటర్‌ చదివేవారు సెప్టెంబరు, అక్టోబరులో రాసే పరీక్షల కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.25 ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో సెప్టెంబరు 1వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox