భాజపాలో చేరేందుకు ఈనెల 21న ముహూర్తం: రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)

స్పీకర్‌ని 8వ తేదీన కలిసి రాజీనామా ఆమోదం తెలుసుకుంటానని రాజగోెపాల్ రెడ్డి ప్రకటన

న్యూదిల్లీ: భాజపాలో చేరేందుకు ఈనెల 21న ముహూర్తం ఖరారు చేసినట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 21న తనతో పాటు చాలా మంది ఉద్యమ నేపథ్యం ఉన్న వారందరూ బీజేపీ(BJP)లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) చేరతారన్నారు. నేడు దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్ముడు పోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. 13 ఏళ్లలో ఒక్క కేసు కూడా తనపై లేదన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy)పై 120 కేసులు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పెట్టారా? అని రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు.కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి లేదన్నారు. నా రాజీనామా నాకోసం కాదు.. తెలంగాణ, మునుగోడు ప్రజల కోసమని వెల్లడించారు. స్పీకర్‌ని 8వ తేదీన కలిసి రాజీనామా ఆమోదం తెలుసుకుంటానన్నారు. రేవంత్ రెడ్డి భాషను మునుగోడు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం