ఎన్నికలు వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

రాజీనామా ఆమోదం కోసం 8న స్పీకర్‌ను కలుస్తానని రాజగోపాల్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోమటిరెడ్డి బ్రదర్స్ వెళ్లిపోతే.. ముఖ్యమంత్రి అయ్యే కల నెరవేరదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైట్ టైంలో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఇదిలా ఉండగా, తన రాజీనామా ఆమోదించకపోతే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు కూర్చుంటానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ (CM KCR), కాంగ్రెస్‌ పార్టీలో అవమానాలకు గురైన నేతలు బీజేపీలో చేరతారని తెలిపారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం