అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు

న్యూదిల్లీ: ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించడంలో రాష్ట్రాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్‌రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీలో తమ వివరాలు నమోదుచేసుకొని రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వెరిఫికేషన్‌ కోసం ఆ డాటాను సంబంధిత రాష్ట్రాలకు పంపిస్తారు. వారు రేషన్‌ కార్డు పొందాక వన్‌రేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు ప్రోగ్రామ్‌ కింద దేశంలోని ఏ రేషన్‌ షాపులోనైనా ఆహారధాన్యాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయనున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం