జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ‌

ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వాహణ

ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. చేనేత ఉత్పత్తులను పెంచి వాటి ప్రత్యేకతను తెలియజేసేందుకు, చేనేత కార్మీకులను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్రాస్ విశ్వవిద్యాలయంలో 2015 నుంచి ఈ దినోత్సవాన్ని జాతీయ చేనేత దినోత్సవంగా పేర్కొన్నారు. 1905 కలకత్తా టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వదేశీ వస్తు, వస్త్ర వినియోగం, విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణ కోసం ఓ ప్రతిజ్ఞను పూనుకున్నారు. అనంతరం (1905-2015)కు వందేళ్లకు ప్రధాని మోదీ చేనేత పరిశ్రమ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించ‌డం కోసం జాతీయ చేనేతను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకోవాలని సూచించారు. 

అసలు లూమ్ అంటే బట్టను తయారు చేసేందుకు ఉపయోగించే ఓ ఎలక్ట్రిక్ సాధనం లేదా విద్యుత్ తో నడిచే సాధనం. అయితే హ్యాండ్లూమ్ అంటే ఎలక్ట్రీసిటీ( విద్యుచ్ఛక్తి) లేకుండా గుడ్డను తయారు చేయడం అని అర్థం. ముఖ్యంగా చేతులతో నేసే పని. లేదా దీనినే చేనేత అని అంటారు. భారతదేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి మార్గంగా వస్త్ర, చేనేత రంగాన్ని ప్రజలు ఎంచుకున్నారు. నాల్గో అఖిల భారత చేనేత సెన్సస్ 2019-20 ప్రకారం 31.45 లక్షల మంది చేనేత, నేత, అనుబంధ కార్యకలాపాలలో ఉపాధి పొందుతున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox