దిల్లీలో మరో మంకీపాక్స్(Monkeypox) కేసు.. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు
22 ఏళ్ల యువతికి పాజిటివ్
న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా తోపాటు మంకీపాక్స్(Monkeypox) కేసులు సైతం అధికమవుతున్నాయి. దీంతో దిల్లీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు దిల్లీలో ఐదో మంకీపాక్స్(Monkeypox) కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్(Monkeypox) లక్షణాలతో లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేరిన ఓ 22 ఏళ్ల యువతికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎల్ఎన్జేపీ డాక్టర్ సురేశ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఈమధ్య కాలంలో ఆమె ఇతర దేశాలకు వెళ్లలేదని.. నెల రోజుల క్రితం మాత్రం విదేశాలకు వెళ్లివచ్చారని చెప్పారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నలుగురు మంకీపాక్స్(Monkeypox) బాధితులు చికిత్స పొందుతున్నారని, మరొకరు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని పేర్కొన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox