కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌: రేవంత్ రెడ్డి

ట్వీటర్ వేదికగా వీడియో పోస్ట్

హైద‌రాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల వ్యాఖ్యలకు,హోంగార్డు ప్ర‌స్తావ‌న‌, చండూరు స‌భ‌లో వ్యాఖ్య‌ల‌పై బాధ్య‌త వ‌హిస్తూ క్షమాపణలు చెబుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. చండూరు స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని రేవంత్ అన్నారు.

ఇలాంటి భాష ఎవ‌రికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించి, రాష్ట్ర సాధ‌న‌లో పాత్ర పోషించిన కోమ‌టిరెడ్డిని అవ‌మానించే విధంగా ఎవ‌రూ మాట్లాడిన త‌గ‌దు. త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ చిన్నారెడ్డి సూచ‌న చేయ‌డం జ‌రుగుతంద‌ని రేవంత్ రెడ్డి త‌న వీడియోలో పేర్కొన్నారు.

కాగా, చండూరు స‌భ‌లో త‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన అద్దంకి దయాక‌ర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోమ‌టిరెడ్డి డిమాండ్ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు మునుగోడుకు దూరంగా ఉంటాన‌ని ఎంపీ తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాల మ‌ధ్య రేవంత్ ఓ మెట్టు దిగి కోమ‌టిరెడ్డికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం