దేశంలో పెరిగిన కరోనా.. కొత్తగా 15,815 కరోనా కేసులు

కరోనాతో 68 మంది మృతి

న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 16,561 పాజిటివ్‌ కేసులు నమోదవగా, శనివారం కొత్తగా 15,815 కేసులు రికార్డయ్యాయి. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జవగా, 68 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసులు 4,42,39,372కు చేరాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,996 మంది మరణించారు. మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. 

 ఇక మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 207.71 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించంది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం