పురుగుల మందుని వంట నూనెగా భావించి కోడి కూర వండిన భార్య.. తర్వాత ఏమైందంటే..

భార్య మృతి... ఇద్దరి పరిస్థితి విషమం

ఖమ్మం: పురుగుల మందుని వంట నూనెగా భావించి వంట చేసిన కుటుంబంలో వడ్డించడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మతిస్థిమితం లేని ఓ మహిళ వంటగదిలో ఉన్న పురుగుల మందుని మంచినూనెగా భావించి, కోడి కూర చేసి భర్త, కూతురి కోసం పొలానికి తీసుకెళ్లింది. అయితే అన్నం కలుపుతుండగా వాసన రావడంతో రెండు ముద్దలు నోట్లో పెట్టుకుని పడేశారు. అయితే, అప్పటికే మహిళ తినడంతో వాంతులు కావడంతో ముగ్గుర్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న మహిళ ప్రాణాలు కోల్పోగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. 

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మేడిదపల్లి గ్రామానికి చెందిన బండ్ల నాగమ్మ (37) గురువారం ఉదయం ఇంట్లో వంటచేస్తూ.. వంట గదిలో ఉన్న పురుగు మందు డబ్బాను మంచి నూనె డబ్బా అనుకొని, ఆ మందునే కూరలో పోసింది. అన్నం, కూర అయిన తర్వాత ముందు తాను భోజనం చేసి.. ఆ తర్వాత అన్నం పెట్టుకుని పొలంలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కుమార్తె పల్లవికి తీసుకొచ్చింది.

మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నాన్ని తిన్నాడు. కూతురికి కూర ఏదో వాసన రావడంతో రెండు ముద్దలు తినేసి పడేసింది. అప్పటికే నాగమ్మకు వాంతులు కావడంతో కూరలో ఏదో కలిసిందన్న అనుమానంతో చుట్టుపక్కల వాళ్లు ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం నాగమ్మ మృతిచెందింది. భర్త పుల్లయ్య, కుమార్తె పల్లవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం