31 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో తెరుచుకోనున్న థియేటర్

కశ్మీర్‌లో 30 తర్వాత అందుబాటులోకి

శ్రీనగర్‌: తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో శ్రీనగర్‌లో 1990లో సినిమా టాకీస్‌లు మూతపడ్డాయి. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ఓపెన్‌ కానుండటం విశేషం. 31 ఏళ్ల తర్వాత కశ్మీర్ తో థియేటర్ ప్రారంభం కానుంది. కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ థియేటర్‌ సెప్టెంబర్‌ నెలలో ఓపెన్‌ కానుంది. ఐనాక్స్‌ సంస్థ ఆ థియేటర్‌ను సిద్ధం చేస్తోంది.

మూడేండ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సరిహద్దులతోపాటు అంతర్గతంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో కంటే తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వినోద సాధనమైన థియేటర్లను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో కొన్ని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు యువతకు సినిమా మాధ్యమాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుంది.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం