కంటి తెల్లగుడ్డుపై జాతీయ జెండాను చిత్రీకరించుకున్న సామాజిక కార్యకర్త

ఇలాంటి ప్ర‌యోగం ఎవ‌రూ చేయొద్ద‌ని రాజా విజ్ఞ‌ప్తి

చెన్నై: కంటిలో జాతీయ జెండా చిత్రీకరించుకుని దేశ‌భ‌క్తిని చాటుకున్నారు ఓ సామాజిక కార్య‌క‌ర్త‌. స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌లు దేశ వ్యాప్తంగా అట్ట‌హాసంగా జరుగుతున్న నేపథ్యంలో త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌కు చెందిన ఓ సామాజిక కార్య‌క‌ర్త త‌న‌కున్న దేశ‌భ‌క్తిని వినూత్నంగా చాటుకున్నారు. త‌న కుడి కంటి తెల్లగుడ్డుపై జాతీయ జెండాను చిత్రీకరించుకుని స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగ‌స్వామి అయ్యారు.

కోయంబ‌త్తూరులోని కునియంతూర్‌కు చెందిన యూఎంటీ రాజా మినీయేచ‌ర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. తన దేశ భక్తిని చాటుకునేందుకు కనుగుడ్డుపైనే జాతీయ జెండాను చిత్రీక‌రించాడు. కాగా, వైద్యుల సలహా మేరకు జాతీయ జెండానున కనుగుడ్డులో తీయించుకున్నానని, ఈ జెండాను చిత్రీక‌రించేందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్టిందన్నారు.

మొద‌ట క‌నుగుడ్డులోని తెల్ల‌సొన ప‌లుచ‌ని పొర‌కు మైనంతో త్రివ‌ర్ణ ప‌తాకం రంగుల‌ను పూశాడు. ఆ త‌ర్వాత దాదాపు 20 నిమిషాల పాటు కంటిలో ఆ పెయింట్‌ను ఉంచాడు. ఆ పెయింట్ క‌నుగుడ్డుపై ప్రింట్ అయిన త‌ర్వాత తొల‌గించాడు. అయితే ఇలాంటి ప్ర‌యోగం ఎవ‌రూ చేయొద్ద‌ని రాజా విజ్ఞ‌ప్తి చేశాడు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం