జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్

ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తులు

న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజినీర్‌ (JE) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) చేపట్టింది. ఆయా పోస్టులకు సెప్టెంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ సివిల్‌, మెకానికల్‌, సీపీడబ్లూడీలో.. సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఎంఈఎస్‌, బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో జేఈ సివిల్‌, మెకానికల్‌ అండ్‌ మెకానికల్‌, సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌లో.. జేఈ మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌

డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌లో.. జేఈ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టులో.. జేఈ సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో.. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు బీటెక్‌ లేదా డిప్లొమా చేసి 30 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్‌ 2 వరకు దరఖాస్తులకు చివరితేదీ. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ssc.nic.in.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం