తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శం: మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో 750 మీటర్ల భారీ జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గాంధీ కలలను సాకారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. 20 సంసద్ ఆదర్శ్ గ్రామాల జాబితాలో 19 మనవే ఉన్నాయని చెప్పారు.
బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులతో సంగారెడ్డి దశదిశ మారనుందని స్పష్టం చేశారు. ఈ జిల్లాలో కొత్తగా 42 వేల ఆసరా పెన్షన్లు రాబోతున్నాయని తెలిపారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని స్పష్టం చేశారు. ఆగస్టు 15న ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox