హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఎల్లో అల‌ర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైద‌రాబాద్: హైద‌రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా సాయత్రం వన చినుకులు పడుతున్నాయి. గత కొన్నాళ్లుగా వర్షాలకు బ్రేక్ రాగా, సోమవారం వర్షం దంచి కొడుతోంది.  ఇక మంగ‌ళ‌వారం కూడా తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అలాగే  హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ వెల్లడించింది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox