‘రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు..’: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)

ట్వీటర్ వేదికగా చిరంజీవి తాజా అప్డేట్

హైదరాబాద్: ‘నేను రాజ‌కీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు..’అంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అన్నారు. అయితే ఇదేదో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ (God Father).

ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవి సినిమా నుంచి ఓ డైలాగ్ ను చిరు విడుదల చేశారు. రాజకీయాల నేప‌థ్యంలో చిరంజీవి చెప్తున్న ఈ సంభాష‌ణ‌లు విని ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా,  10 సెక్ల‌న‌పాటు ఉన్న ఈ డైలాగ్ ఇపుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు. న‌య‌న‌తార ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా..స‌త్య‌దేవ్, పూరీ జ‌గ‌న్నాథ్ కీ రోల్స్ చేస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఓ డైలాగ్‌ను విడుద‌ల చేసి అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు చిరు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం