నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) భారీగా వరద నీరు
దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు
హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువన వర్షలు కురవడంతో జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి 2,56,076 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.90 అడుగుల నీరు ప్రాజెక్టులో ఉంది.
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)కు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. దీంతో డ్యామ్ పది గేట్లను ఎత్తి 1.49లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 589.90 అడుగులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.55 టీఎంసీల నీరున్నది. ఇదిలా ఉండగా, జూరాల ప్రాజెక్టుకు 22.21లక్షల క్యూసెక్కుల ఉండగా.. అధికారులు 45 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 2,21,266 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.750 టీఎంసీలు నిల్వ ఉన్నది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox