ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) పై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్

ద‌త్త‌త గ్రామం అభివృద్ధిపై కేటీఆర్ స్పంద‌న‌

హైద‌రాబాద్: ప్రముఖ సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj)‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ద‌త్త‌త తీసుకున్న గ్రామంలో జ‌రిగిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోల‌ను మ‌ధుసూద‌న్ రావు అనే వ్య‌క్తి కేటీఆర్‌కు ట్యాగ్ చేయ‌గా, ఆయ‌న స్పందించారు. "ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ద‌త్త‌త తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందింద‌ని కేటీఆర్ త‌న ట్వీట్టర్ లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజ‌య్య‌తో క‌లిసి గొప్ప పురోగ‌తిని సాధించార‌ని కేటీఆర్ కొనియాడారు". 

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గ్రామ‌జ్యోతి కార్య‌క్రమం స్ఫూర్తితో 2015, సెప్టెంబ‌ర్‌లో షాద్‌న‌గ‌ర్ నియోజక‌వ‌ర్గం ప‌రిధిలోని కేశంపేట మండ‌లంలోని కొండారెడ్డిప‌ల్లి గ్రామాన్ని ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ద‌త్త‌త తీసుకున్నారు. ఆ త‌ర్వాత గ్రామాభివృద్ధికి ఆయ‌న ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం