వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు కేసీఆర్ కట్టుబడి ఉన్నారు: మంత్రి కేటీఆర్

వీఆర్ఏల స‌మ‌స్య‌కు త్వరలోనే ప‌రిష్కారం చూపుతామన్న కేటీఆర్

హైద‌రాబాద్: వీఆర్ఏల‌కు ఇచ్చిన హామీల అమ‌లుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నార‌ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న వీఆర్ఏల‌తో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. త్వ‌ర‌లోనే వీఆర్ఏల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాద‌ని పేర్కొన్నారు. వీఆర్ఏలో ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని మంత్రిని కోరామ‌ని వీఆర్ఏలు పేర్కొన్నారు. వీఆర్ఏల స‌మ‌స్య 25 వేల కుటుంబాల‌తో ముడిప‌డి ఉంద‌ని వారు తెలిపారు. కాగా, త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చ‌ర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్‌కు వీఆర్ఏ ప్ర‌తినిధులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం