ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్టు బండి ’ (Bullet Bandi Ashok) వరుడు

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన బుల్లెట్ బండి అశోక్ (Bullet Bandi Ashok)

హైదరాబాద్: దంపతులు సాయి శ్రియ, అశోక్ (Bullet Bandi Ashok) గుర్తుండే ఉంటారు. ఈ దంపతులు ‘బుల్లెట్టు బండి’ పాట‌కు స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన సాయి శ్రియ భర్త అశోక్ ఏసీబీ వలకు చిక్కారు. అశోక్ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో టౌన్‌ ప్లానింగ్ అధికారిగా (Town Plannig Ashok) పనిచేస్తున్నాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తనిఖీలు చేయగా రూ. 30 వేలు లంచం తీసుకుంటూ బుల్లెట్ బండి అశోక్(Bullet Bandi Ashok) పట్టుబడ్డాడు. దీంతో అశోక్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

2021, ఆగస్ట్ 14న మంచిర్యాల జ‌న్నారాని చెందిన రాము, సురేఖ దంప‌తుల పెద్ద కుమార్తె సాయి శ్రియ వివాహం రామ‌కృష్ణాపూర్‌కు చెందిన అశోక్‌తో జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక త‌ర్వాత జ‌రిగిన అప్ప‌గింత‌ల స‌మ‌యంలో ‘బుల్లెట్టు బండి’ పాట‌కు న‌వ వ‌ధువు సాయి శ్రియ‌ చేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox