ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరేండ్ల కాలంలోనే కేసీఆర్ రూపుమాపారు: మంత్రి జగదీష్‌ రెడ్డి (Jagadish Reddy)

తెరాస కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

చౌటుప్పల్: దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని, ఇటువంటి నాయకత్వమే తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన తెరాస కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరేండ్ల కాలంలోనే రూపుమాపారన్నారు.

కేసీఆర్ వస్తేనే తెలంగాణలోని పథకాలు తమ రాష్ట్రాల్లో అమలు అవుతాయని ఆశపడుతున్నారని పక్క రాష్ట్రం నాయకులు కేసీఆర్ తమ నాయకుడు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, కిషోర్ కుమార్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox