'డ్రాగన్' ఫ్రూట్ తింటే ఎక్కడ లేని ప్రయోజనాలు పొందవచ్చు

డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందామా..

 హైదరాబాద్: డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి వికారంగా, భయంకరంగా ఉన్నా అది తింటే ఎక్కడ లేని ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్ పండించడం లాభాలను తేవడమే కాకుండా.. దాని వినియోగం ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుతుంది. క్యాన్సర్, మధుమేహం వంటి అనేక వ్యాధులను కూడా డ్రాగన్ ఫ్రూట్ దూరం చేస్తుంది. ఈ పండును రోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లక్షలు పెట్టి వ్యాధులు నయం చేసుకోవడం కన్నా వాటిని రాకుండా చేసుకోవచ్చు. 

  • గుండెకు మంచిది: డ్రాగన్ ఫ్రూట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఒమేగా -3, ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఈ పండులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.
  • క్యాన్సర్‌ ను దూరంగా ఉంచుతుంది: ఈ పండులో యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఇది రొమ్ము క్యాన్సర్ నుంచి మహిళలను రక్షిస్తుంది. ఇంకా, ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో తెలింది. ఇంకెందుకు ఆలస్యం డ్రాగన్ ఫ్రూట్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి. 
  • మధుమేహాన్ని నియంత్రిస్తుంది: డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు మధుమేహం లేని వారు డ్రాగన్ ఫ్రూట్స్ తింటే భవిష్యత్తులో మధుమేహం దరిచేరదు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం