మలక్‌పేట్‌లో హిట్ అండ్ రన్ కేసు.. చావుబ్రతుకుల మధ్య డాక్టర్

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

హైదరాబాద్: వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం తదితర కారణాలతో పలువురి ప్రాణాలకు తీవ్ర హాని జరుగుతుంటుంది. తాజాగా మలక్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న డాక్టర్ శ్రావణిని అనే యువతిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. అనంతరం కారు డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.   సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డాక్టర్ శ్రావణిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారును ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox