చేపలతో ఈజీగా తయారు చేసుకునే స్నాక్స్

కావలసినవి, తయారీ విధానం

కావలసినవి: చేపలు - పావుకిలో, బ్రెడ్‌ ముక్కలు - అరకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఆవాలు, ఒక టీస్పూన్‌, మెంతులు - అరటీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, మైదా పిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, శనగపిండి - అర టేబుల్‌స్పూన్‌, కోడిగుడ్లు - రెండు, 

తయారీ విధానం: జీలకర్ర, ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో మైదా, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత కోడిగుడ్ల తెల్లసొన వేసి కలియబెట్టాలి. చేపలను నిలువుగా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. చేప ముక్కలను పిండిలో వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి మారినేట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మారినేట్‌ చేసిన చేప ముక్కలకు బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్ది వేగించాలి. అంతే చేప ముక్కలతో ఈజీ స్నాక్స్.. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox