5 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ప్రచార ఖర్చు రూ.340 కోట్లు

కాంగ్రెస్ పార్టీ ఖర్చు రూ.194 కోట్లు

న్యూదిల్లీ: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్‌ ద్వారా వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ఎన్నికల ఖర్చు రిపోర్ట్‌లను ఎన్నికల కమీషన్‌ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తమ పార్టీ ప్రచారం కోసం 340 కోట్లు ఖర్చు చేసింది.

కాగా, ఇక ఆ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ పార్టీ తమ ప్రచారం కోసం సుమారు 194 కోట్లు ఖర్చు చేసినట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పార్టీ ఎన్నికల ఖర్చును వెల్లడించింది. అయితే యూపీలో 221, మణిపూర్‌లో 23, ఉత్తరాఖండ్‌లో 43, పంజాబ్‌లో 36, గోవాలో 19 కోట్లు బీజేపీ ఖర్చు చేసింది. ఈ 5 రాష్ట్రాల్లోనే 194 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస పార్టీ ఈసీకి ఇచ్చిన తన నివేదికలో తెలిపింది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం