రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్
విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదన్న కేటీఆర్
సిరిసిల్లా: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
సిరిసిల్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గిఫ్ట్ ఏ స్మైల్ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూర్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్ సైకిళ్లు అందించామని తెలిపారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్ అందిస్తున్నామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్ పంపిణీ చేస్తున్నాని వెల్లడిచారు. విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఊహించని విధంగా ఎన్నో విద్యాసంస్థలను ప్రారంభించుకున్నామని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.విదేశాల్లో విద్యనభ్యసించే వారికోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox